బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 28 స్థానాల్లో 19 చోట్ల ఎల్జేపీ(RV) విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయం పట్ల ఎల్జేపీ(RV) అధినేత చిరాగ్ పాసవాన్ స్పందించారు. 2021లోనే తన పనైపోయిందని ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనూ NDA కూటమిలో చిచ్చు పెట్టేందుకు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు తను ఎంతగానో పోరాటం చేశాని చెప్పారు.