KRNL: దేవనకొండలోని జడ్పీ హైస్కూల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల స్కూల్ భవనం పెచ్చులు ఊడి పడిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు భవన మరమ్మతులు వెంటనే చేపట్టాలని వారు కోరారు.