‘SSMB 29’ మూవీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ ఈవెంట్ వివరాలను చెబుతూ రాజమౌళి పోస్ట్ పెట్టాడు. ‘ఈ ఈవెంట్లో టైటిల్‌తో పాటు సినిమాకు సంబంధించి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ విజువల్స్ కూడా వస్తాయి. అక్కడ ఏర్పాటు చేసిన 100 అడుగుల స్క్రీన్‌పై ప్రదర్శించిన అనంతరం ఆన్లైన్ వేదికగానూ విడుదల చేస్తాం’ అని తెలిపాడు.