అనంతపురం నగర శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో కుక్కలు, పశువుల బెడద లేకుండా చేస్తామన్నారు. ప్రతి డివిజన్లో 100 శాతం పూర్తయ్యాక ఇంకో డివిజన్‌కు వెళ్తామన్నారు. రోజుకు 50 నుంచి 60 కుక్కలకు ఆపరేషన్ చేస్తామని తెలిపారు.