ADB: బిర్సా ముండా ఆశయాలు తరతరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడని కొనియాడారు.