AP: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇండిగో సర్వీస్‌ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రత్యేక చొరవతో సింగపూర్‌కు ఇండిగో సర్వీసులు వచ్చాయని చెప్పారు. విమానాల సంఖ్య 50 శాతం పెరిగిందని, రోజుకు 48 విమానాలు తిరుగుతున్నాయని తెలిపారు. కృష్ణా, గుంటూరు సహా పలు జిల్లాల NRIలకు ఈ అంతర్జాతీయ సర్వీస్ ఉపయోగపడనున్నట్లు వెల్లడించారు.