WGL: పర్వతగిరి మండలంలోని స్థానిక సబ్ మార్కెట్ యార్డులో ఘోర ప్రమాదం ఇవాళ జరిగింది. ఏనుగల్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ మల్లేశం (53) మారుతీ ఇండస్ట్రీస్ నుంచి బియ్యం లోడుతో మార్కెట్ యార్డ్ గోదాముకు వచ్చాడు. బస్తాలపై ఉన్న కవర్ తొలగించేందుకు లారీపైకి ఎక్కి పని చేస్తూ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.