ASF: రెబ్బెన మండలం కైరిగాం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిర్యానికి చెందిన సివిల్ కానిస్టేబుల్ రాము శనివారం ఉదయం మృతి చెందినట్లు రెబ్బెన SI వెంకటకృష్ణ తెలిపారు. ఈ నెల 13న కైరిగాం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రాము తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు వెల్లడించారు.