మహేష్ బాబు, రాజమౌళి ‘SSMB 29’ మూవీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్ ద్వారా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ వంటివి రివీల్ అవుతాయని ఖుషి అవుతున్నారు. అంతేకాదు మహేష్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయో అని చర్చించుకుంటున్నారు.