SDPT: కోహెడ మండలం వరికోలు గ్రామంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి అదుపుతప్పి డీసీఎం వ్యాన్ మురికి కాలువలోకి దూసుకు వెళ్లింది. టైర్లు మాత్రమే మురికి కాలువలో దిగడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు. గ్రామంలో రోడ్డు మార్గం చిన్నగా ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు తెలిపారు.