NLG: ఎన్జీ కళాశాల మైదానంలో హనుమాన్ చాలీసా లక్ష గళ పారాయణం చేపడుతున్న సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున శనివారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.