SRCL: మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ రిజర్వాయర్లో శనివారం చేప పిల్లలను ఎమ్మెల్యే సత్యనారాయణ వదిలిపెట్టారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.