కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సంఘటన గురించి నటి చాందిని చౌదరి పేర్కొంది. ‘ఓ మూవీ కథ చెప్పినప్పుడు ముద్దు సీన్ల గురించి మొదట చెప్పలేదు. ఆ సమయంలో అర్జున్ రెడ్డి విడుదలై హిట్ అందుకుంది. దీంతో మా మూవీలోనూ ముద్దు సీన్లు పెడితే హిట్ అవుతుందని భావించి.. నన్ను ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి తెచ్చారు. అయితే, హీరో చేయనని చెప్పడంతో రిలాక్స్‌గా ఫీలయ్యారు’ అని చెప్పింది.