ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ను తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం శాలువతో సన్మానించారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ బైపోల్లో నవీన్ యాదవ్ గెలుపుకు ఎమ్మెల్సీ దండే విఠల్ కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని భావించి ప్రజలు విజయం అందించారని అన్నారు.