AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ బైక్ను పోలీసులు గుర్తించారు. బైక్ పార్క్ చేసిన అతడు గుంతకల్లు రైల్వేస్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.