కడప జిల్లాలోని ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు మైదుకూరు అర్బన్ సీఐ కె. రమణా రెడ్డి శనివారం ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు యూనిఫామ్, లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పక కలిగి ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.