KMR: రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్లను జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ఇళ్లు మంజూరై ఇంకా ఎందుకు నిర్మించడం లేదని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇప్పటికైనా నిర్మాణ పనులు చేపట్టాలని మోటివేషన్ చేశారు.