ఢిల్లీ పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫరీదాబాద్ సమీపంలోని దౌజ్, నుహ్ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ క్రమంలో మరో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ ముజమ్మిల్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు పదార్థాల కొనుగోలులో అనుమానితుల పాత్రపై ఆరా తీస్తున్నారు.