ADB: ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్ రాథోడ్ అన్నారు. గాదిగూడ మండలంలోని లోకారి(బి) గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ అంబోరి పూజను శనివారం ఆయన పరామర్శించారు. ఆమెకు అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.