కోల్కతా టెస్ట్ తొలి రోజు ఆటలో బుమ్రా, పంత్ సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాను ఉద్దేశించి ‘బౌనా’ అనడంతో విమర్శలు వస్తున్నాయి. బవుమా ఆడిన బంతికి LBW రివ్యూ తీసుకోవాలా వద్దా అని చర్చించుకుంటూ వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సబబు కాదని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. అయితే దీనిపై SA బ్యాటింగ్ కోచ్ ప్రిన్స్ స్పందిస్తూ.. ఎలాంటి చర్చ అవసరం లేదని పేర్కొన్నాడు.