WGL: నెక్కొండ మండల కేంద్రంలోని గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కంట మహేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.