TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచి 24 గంటలు కాకముందే.. BRS కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి KTR మండిపడ్డారు. తమ హయాంలో ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత హద్దులు దాటి ఏనాడైనా ప్రవర్తించామా? అని ప్రశ్నించారు. 7 ఉపఎన్నికలు, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచినా తమ కార్యకర్తలు విర్రవీగలేదన్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.