TG: తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్లకు సంబంధించి 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టనుంది. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.