MHBD: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంచాలని తొర్రూర్ మండలంలో CPM పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. శనివారం సైతం ఈ దీక్షలు కొనసాగుతుండగా CPI(ML) న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ సభ్యులు దీక్ష శిబిరాన్ని సందర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను పంచాలని డిమాండ్ చేశారు.