TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలో BRS ఓటమికి కుట్రలు జరిగాయన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని బయటపెడతానన్నారు. మెదక్ జిల్లా రెడ్డిపల్లిలో ఓ బడా నేత(హరీష్ రావును ఉద్దేశించి) 400 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టారని.. అందుకే RRR అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. దీంతో ఎకర, అరెకర ఉన్న రైతులు నష్టపోతున్నారని విమర్శించారు.