GDWL: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో ‘రాష్ట్ర బస్సు జాత’ ఘనంగా ప్రారంభమైంది. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఉద్యమ పతాకాన్ని ఎగురవేశారు. దేశంలో ఉండే సామాన్య ప్రజల సమస్యలపై పోరాటం చేసిన తమ పార్టీ త్యాగాలను, విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం ప్రారంభించారు.