బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ ఆయనకు అభినందనలు తెలిపారు. కూటమి సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని చిరాగ్ వెల్లడించారు. బీహార్ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని తెలిపారు. కాగా, ఎన్డీయే కూటమి పక్షమైన LJP పార్టీకి 19 సీట్లు వచ్చాయి.