టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 4000 పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన 4వ ప్లేయర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఇయాన్ బోథమ్(ENG), కపిల్ దేవ్(IND), డానియెల్ వెటోరీ(NZ) మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు. బోథమ్(72 టెస్టులు) తర్వాత అత్యంతవేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గానూ జడేజా(87) నిలిచాడు.