సత్యసాయి: రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ధర్మవరం నియోజకవర్గ టీడీపీ నాయకుడు షరీఫ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ధర్మవరం టీడీపీ నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షరీఫ్‌ను పరిటాల శ్రీరామ్ అభినందించారు. రాష్ట్రంలో దూదేకుల సంక్షేమానికి నూతన డైరెక్టర్ కృషి చేయాలని ఆకాంక్షించారు.