BDK: జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో త్రీఫేస్ మోటర్ లేక గ్రామపంచాయతీ ప్రజలు మంచినీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భారతీయ గోర్ బంజారా పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దుర్గ ప్రసాద్ నాయక్ సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లగా శనివారం త్రీఫేస్ మోటార్ బిగించారు.