కోల్‌కతా టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో టీమిండియా రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 138 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జడేజా(11), జురెల్(5) ఉన్నారు. అంతకుముందు రాహుల్(39) పర్వాలేదనింపించినా.. సుందర్ 29, రిషభ్ 27 పరుగులకే ఔట్ అయ్యారు. కెప్టెన్ గిల్(4*) షాట్ ఆడుతుండగా మెడ పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.