W.G: నరసాపురం శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్గా తిరుమాని గోవిందరాజును నియమితులైనట్లు ఈవో రామచంద్రరావు తెలిపారు. ఆయనతో పాటు పలువురు బోర్డు సభ్యులు కూడా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గోవింద రాజు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నూతన కమిటీని పలువురు అభినందించారు.