SDPT: రాయపోల్ మండలం ముంగిస్ పల్లి గ్రామానికి చెందిన మన్నే రేణుక, రమేష్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఐతే అదే గ్రామానికి చెందిన కొంతమంది ఇంటిపై దాడి చేసి నిర్మాణంలో ఉన్న గోడలను కూల్చివేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై మానస కేసు నమోదు చేశారు.