MHBD: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) MHBD జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ బానోత్ జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని IMA హాల్లో శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా డా.జె.ప్రమోద్ రెడ్డి వ్యవహరించగా కమిటీని ఎన్నుకున్నారు. డా.సందీప్ దేవ్ కార్యదర్శిగా, డా.ఎ.అర్జున్ కోశాధికారిగా, డా.సూర్యకుమారి మహిళా ప్రతినిధిగా ఎన్నికయ్యారు.