PPM: సమాజం బాగుండాలంటే, ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే మనం నివశించే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం కురుపాంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.