దర్శకుడు అట్లీ నిర్మాణంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాలాజీ తరిణీధరన్ తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో విజయ్ సరసన నటి లిజోమోల్ జోస్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీని షూటింగ్ స్టార్ అయినట్లు, త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.