SRD: కోహీర్ మండలం బడంపేట గ్రామంలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు బాలరాజ్ తల్లిని హత్య చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బుల కోసం 3 రోజుల నుంచి తల్లి పద్మమ్మ (52)తో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో తల్లిని గోడకు కొట్టడంతో స్పాట్లోనే మృతి చెందింది. శనివారం బాల్ రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.