బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఈరోజు ED ఎదుట హాజరుకానున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఆగస్టులో ED విచారణకు రానా హాజరైన విషయం తెలిసిందే. అయితే, మరోసారి హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు రానా విచారణకు హాజరుకానున్నాడు.