KMR: మద్నూర్లోని వీరభద్ర స్వామి ఆలయంలో ఇవాళ ఉదయం అగ్ని గుండం కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి పూజలు, హరతి చేపట్టి భక్తులు అగ్ని గుండ ప్రవేశం చేశారు. గుండంలో నడిస్తే శుభం కలుగుతుందని నమ్ముతామని వారు తెలిపారు. అనంతరం వీరభద్ర స్వామి పల్లకి ఊరేగించారు. వంద సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పూజారి సంగయప్ప వెల్లడించారు.