భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్తో ఆమె డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20న వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో పెళ్లి జరగనుందట. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.