బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ IPS శివదీప్ ప్రభావం చూపించలేకపోయారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. అరారియా, జమల్పూర్ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, తాజా ఫలితాల్లో రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. కాగా, పోలీస్ శాఖలో బీహార్ ‘సింగం’గా శివదీప్ పేరొందారు.