ASR: అనంతగిరి(M) పైనంపాడు పంచాయతీలో బీఎస్ఎన్ఎల్ సెల్ సేవలు మూగబోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పంచాయతీ పరిధిలోని కాంగుపుట్టు, దుర్గం, దొండలవలస గ్రామాల్లో టవర్లు సక్రమంగా పనిచేయకపోవ డంతో సంకేతాలు రావడం లేదు. మారుమూల గ్రామాలు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. అత్యవసర వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.