AP: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీ అవతరిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 గేమ్ ఛేంజర్‌గా నిలవనుందని పేర్కొన్నారు. దీని ద్వారా రికార్డుస్థాయిలో పెట్టుబడులు వస్తాయన్నారు. రూ.5,22,471 కోట్ల పెట్టుబడుల వల్ల 2,67,239 ఉద్యోగాల కల్పన జరగనుందని చెప్పారు. దిగ్గజ సంస్థల చూపు రాష్ట్ర వైపు ఉందని వివరించారు.