CTR: మూడో శనివారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.