NLG: జిల్లాలో పశుసంవర్ధక శాఖ పరిధిలో పనిచేస్తున్న గో మిత్రలకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 8 నెలలుగా తమకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పులు చేసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. జిల్లాలో సుమారు 100 మందికి పైగానే గోపాలమిత్రలు ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.