టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున 4000 రన్స్ పూర్తి చేసుకున్న 19వ ప్లేయర్గా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 10 రన్స్ వద్ద జడేజా ఈ మైలురాయి చేరుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే కేఎల్ రాహుల్ కూడా 4 వేల రన్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.