ATP: గుత్తి పట్టణ శివారులోని నాగసముద్రం రోడ్డులో గల 63 హైవేపై శనివారం ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న చంద్రశేఖర్ రెడ్డి, రత్నమ్మ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.