WNP: మాజీ ఎమ్మెల్యే దివంగత బాలకిష్ణయ్య 100వ జయంతి పురస్కరించుకొని వనపర్తిలో శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం కమాన్ చౌరస్తాలో బాలకిష్ణయ్య విగ్రహానికి ఆయన కుటుంబసభ్యులు, స్థానికులు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. డాక్టర్ భూపేష్, మండ్ల దేవన్ననాయుడు, తదితరులు పాల్గొన్నారు.