ASF: బాలుడితో పని చేయిస్తున్న యాజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ లోని బాబాయి హోటల్, దేవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మైనర్ బాలురతో పనులు చేయిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా చైల్డ్ ప్రొటెక్షన్ స్మైల్ ఎక్స్ టీమ్ తనిఖీలు చేపట్టి, వారిని గుర్తించి బాలల సంరక్షణ విభాగానికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.