E.G: లేనిపోని ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించే రామశర్మ, అతడికి సహకరించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని మాజీ ఎంపీ మార్గాని భరత్ హెచ్చరించారు. ప్రజల సొమ్ము కాజేసి పత్తా లేకుండా పోయిన వ్యక్తికి ఆశ్రయమిచ్చి తనపై బురద జల్లడం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. అతడు చేసిన ఆరోపణలు అవాస్తవమని ఖండించారు.